YV Subba Reddy: వైకుంఠ ఏకాదశికి సిఫార్సు లేఖలు పంపవద్దు.. విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం..

Vaikunta Ekadasi 2022: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు పంపవద్దని టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విఐపీలకు విజ్ఞప్తి చేసారు.

Update: 2022-01-02 13:07 GMT

YV Subba Reddy: వైకుంఠ ఏకాదశికి సిఫార్సు లేఖలు పంపవద్దు.. విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం..

Vaikunta Ekadasi 2022: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు పంపవద్దని టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విఐపీలకు విజ్ఞప్తి చేసారు. టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపారు. విఐపీలు స్వయంగా వారి కుటుంబసభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమలకు వచ్చే సామన్యభక్తులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రముఖులందరు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News