శ్రీవారి హుండీకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎంతంటే!

Update: 2021-01-11 04:50 GMT

తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు సంక్రాంతి సెలవులు, మరోవైపు వారంతాం కావడంతో నిన్న ఒక్కరోజే స్వామివారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో కోనేటిరాయుడి హుండీ ఆదాయం పెరింది. నిన్న ఆదివారం నాడు స్వామివారిని 37,849 మంది భక్తులు దర్శించుకున్నారని, 15,338 మంది తలనీలాలు సమర్పించారని తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

మళ్లీ దాదాపు పది రోజుల తర్వాత ఆదాయం రూ.3కోట్లు దాటింది. ఈ వారంలో సంక్రాంత్రి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. మరోవైపు భక్తులు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు పటిస్తున్నామని తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వామిని దర్శించుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 



Tags:    

Similar News