Andhra Pradesh: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై బదిలీ వేటు
Andhra Pradesh: కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
Andhra Pradesh: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై బదిలీ వేటుపడింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం సవాంగ్‌కు ఆదేశించింది. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్‌ను బదిలీ చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు.
కొత్త డీజీపీగా నియాకమైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. మే 2020 నుండి ఈ పదవిలో ఉన్న రాజేంద్రనాధ్ రెడ్డి గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా సేవలందించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ GAD వంటి పదవులను నిర్వహించారు.