Badvel Bypoll: రేపే బద్వేల్ బైపోల్‌

* మొత్తం 281 పోలింగ్‌ కేంద్రాలు * 148 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు * నియోజకవర్గంలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు

Update: 2021-10-29 04:29 GMT

రేపే బద్వేలు బైపోల్‌(ఫైల్ ఫోటో)

Badvel Bypoll: బద్వేలు ఉపపోరుకు సమయం దగ్గర పడింది. రేపు బద్వేల్ బైపోల్‌ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాల్లో 148 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు.

నియోజకవర్గంలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గం పరిధిలో 15 ప్లటూన్ల పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. మొత్తం 2 వేల మందితో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశారు.

బద్వేలు ఉపఎన్నికలో జనసేన, టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అనుకున్నారు. అయితే బైపోల్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. దీంతో వైసీపీ వర్సెస్‌ బీజేపీగా మారింది.

దీంతో బద్వేల్‌ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. బీజేపీ గెలిచి వైసీపీ వరుస విజయాలకు చెక్‌ పెట్టాలని చూస్తుండగా ఈ ఎన్నికలో కూడా గెలిచి తన మార్క్‌ను కొనసాగించాలని వైసీపీ పట్టుదలతో ఉంది.

ఇక బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 16 వేల 139 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు లక్షా 8వేల 777 మంది ఉండగా మహిళలు లక్షా 7వేల 340 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో లక్షా 50వేల 621 ఓట్లు పోలైతే వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్యకు 95 వేల 482 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 50 వేల 748 ఓట్లు పడ్డాయి. దీంతో 44 వేల 734 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.

అయితే ఈ సారి మాత్రం ఎంత వరకు పోలింగ్ నమోదవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. వెంకట సుబ్బయ్య మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి డాక్టరు సుధాను వైసీపీ బరిలోకి దింపింది. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకొని, లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయ సాధించాలని వ్యూహ రచన చేస్తోంది వైసీపీ.

Full View
Tags:    

Similar News