నేడు ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్..?
* గతేడాదిలోనే 9,696 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు * పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
ఏపీలో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. ఎన్నో అవరోధాల మధ్య మొదలైన పంచాయతీ ఎన్నికలు.. విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా రేపు మరో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక నిన్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది ఎస్‌ఈసీ. ఇవాళ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
గత ఏడాది 9 వేల 696 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్ విజృంభణ కారణంగా అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు.. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో బలవంతపు ఏకగ్రీవాలంటూ ఎస్‌ఈసీకి విపక్షాల ఫిర్యాదు చేశాయి. దీంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? లేక మున్సిపల్ కార్పొరేషన్ మాదిరి ఆగిన చోటు నుంచే కొనసాగిస్తారా? అనే దానిపై సందిగ్థత ఏర్పడింది.