Tirupati By Poll: మరికొన్ని గంటల్లో తిరుపతి ఉపఎన్నిక పోలింగ్
Tirupati By Poll: నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్‌పై సబ్ కలెక్టర్ అసహనం
Tirupati By Poll: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల సామాగ్రి పంపిణీ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఇద్దరు అధికారులు వాగ్వాదానికి దిగారు. గూడురు సబ్ కలెక్టర్ గోపాలకృష్మ, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు ఎన్నికల విధులపై వాదులాడుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఎదుటే పరసర్పరం హెచ్చరించుకున్నారు. విధి నిర్వాహణలో పది రోజులుగా నిద్రాహారాలు లేవంటూ మున్సిపల్ కమిషనర్ ఓబులేసు సబ్ కలెక్టర్ తో చెప్పడంతో వివాదం మొదలయ్యింది. అందరిదీ పరిస్థితి అలాగే ఉందని ఎన్నికల కమిషనర్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలంటూ సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ అసహనం వ్యక్తం చేశారు.
సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పిన సమాధానంపై మున్సిపల్ కమిషనర్ ఓబులేసు రెట్టింపు వేగంతో అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరూ అధికారులు డయాస్ పైనే వాదులాటకు దిగడంతో ఎన్నికల సిబ్బంది అవాక్కయ్యారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తానంటూ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ హెచ్చరించారు. సబ్ కలెక్టర్ హెచ్చరికతో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు అంతే స్థాయిలో తిరుగు సమాధానం ఇచ్చారు. మరో అధికారి వచ్చి ఇద్దరు అధికారులకు సర్ధి చెప్పారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వాహణకు సమాయత్తమవుతున్న తరుణంలో వాగ్వాదానికి దిగడంతో అంతా నివ్వెరపోయారు.