టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు.. శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో మార్పులు..

Tirumala Tirupati Devasthanam: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Update: 2022-09-24 10:29 GMT

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు.. శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో మార్పులు..

Tirumala Tirupati Devasthanam: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్చించామని తెలిపారు. అలాగే, బ్రహ్మోత్సవాల అనంతరం తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే, శ్రీవారి బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చాలని నిర్ణయించామన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శన సమయాలను మార్చుతామని చెప్పారు. బ్రహ్మోత్సవాల తర్వాత ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాల మార్పును అమలు చేస్తామని వివరించారు వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ, శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ చైర్మన్.

12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతుసాధికార సంస్థతో ఒప్పందం.. ఇక పీఏసీ-5 భవనాన్ని 95 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. వకుళామాత ఆలయం నుంచి జూపార్క్‌ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 7.20 కోట్లతో తిరుమలలోని గదుల్లో గీజర్ల ఏర్పాటు 6.20 కోట్లతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్‌లో క్లాస్‌రూమ్స్‌, హాస్టల్‌ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు కొనుగోలు చేశామన్న టీటీడీ భవిష్యత్తు అవసరాల కోసం మరో 130 ఎకరాలు కొనుగోలు చేయనున్నారు. 

Tags:    

Similar News