TTD Brahmotsavam 2024: బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల.. శ్రీవారి కోసం కోట్ల కళ్లు ఎదురుచూపు
TTD Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కళ్లారా చూసేందుకు భక్త జనం సిద్ధమవుతోంది. తిరు వీధుల్లో శ్రీవేంకటేశ్వరస్వామి విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అయితే ఈ బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధం అయ్యింది.
TTD Brahmotsavam 2024: ప్రతిఏటా రెండు సార్లు తిరుగిరులపై బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి 7గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటుంది. కాగా లడ్డూ అపవిత్రత వివాదం వల్ల తిరుమలకు ఖ్యాతి కొంతమేర తగ్గింది. భక్తుల ఆ ఆవేదన నుంచి బయటపడేందుకు బ్రహ్మోత్సవాలను అద్బుతంగా నిర్వహించేందుకు రెడీ అవుతోంది టీటీడీ.
బ్రహ్మోత్సవాలకు వెళ్లడం, తిరువీధుల్లో స్వామివారికోసం ఎదురుచూడటం, రోజుకో రథంపై స్వామివారు విహరిస్తూ రావడం, ఆ ద్రుశ్యాన్ని కళ్లారా చూసి పులకించిపోవడం..ఇవన్నీ కూడా మరపురాని, మాటల్లో చెప్పుకోలేని అనుభూతులు. దీనికోసమే కోట్ల కోళ్లు ఎదురుచూస్తున్నాయి. ఆ అనిర్వచనీయ సమయం దగ్గరపడుతోంది.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అలాగే రాత్రి 7గంటల నుంచి 9గంటల వరకు రకరకాల వాహన సేవలను నిర్వహించబోతున్నారు. అలాగే 9 రోజులపాటూ 9 రకాల ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు. అందకే భక్తులంతా తరలివచ్చి మలయప్పస్వామిని చూసి తరించమని టీటీడీ కోరుతుంది.
ప్రతిసారి లాగే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అందుకే వీఐపీలు రావాడం, వాళ్ల వల్ల ఇతర సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడం లేదు. ఇక ఈసారి సెక్యూరిటీ మెజర్స్ కూడా భారీ ఎత్తుల్లో ఉండబోతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో చిరుతల సంచారిస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.