శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల క్షేత్రం.. విష్ణుదర్భతో చేసిన చాప,తాడు స్వామి వారికి సమర్పించిన అటవిశాఖ అధికారులు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Update: 2023-09-16 13:30 GMT

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల క్షేత్రం.. విష్ణుదర్భతో చేసిన చాప,తాడు స్వామి వారికి సమర్పించిన అటవిశాఖ అధికారులు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే టీటీడీ దీనికి సంబంధించిన అన్నిఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ఊపయోగించే చాప, తాడును అటవీశాఖ అధికారులు స్వామివారికి సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీన జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో వీటిని ఉపయోగిస్తారు.

బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో ఉన్న దర్భ చాప.. 203 అడుగుల పొడవు ఉన్న తాడు సిద్ధం చేసి ఆలయ అధికారులకు అందజేశారు. ఇక 18 వ తేదీ సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం స్వామివారి వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Tags:    

Similar News