Andhra Pradesh: రామబంటు వీర హనుమాన్ జన్మస్థానం తిరుమలేనా?

Andhra Pradesh: అంజనీసుతుడు ఎక్కడ జన్మించాడు.? ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉంది. ఈ ప్రశ్నలు భక్తులను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి.

Update: 2021-04-09 15:17 GMT

Andhra Pradesh: రామబంటు వీర హనుమాన్ జన్మస్థానం తిరుమలేనా?

Andhra Pradesh: అంజనీసుతుడు ఎక్కడ జన్మించాడు.? ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉంది. ఈ ప్రశ్నలు భక్తులను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి. ఆంజనేయుడి జన్మస్థలంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్‌ అంటారు. మరికొందరు హర్యానా అంటూ వాధిస్తారు. ఇంకొందరు ఝార్ఖండ్‌ అని చెబుతారు. అవన్నీ కాదని హనుమంతుడు తెలుగునేలపైనే పుట్టాడని టీటీడీ ప్రకటించింది. అది కూడా శ్రీవారు కొలువైన తిరుమలగిరుల్లోనే జన్మించాడని కరాఖండిగా చెబుతోంది. పైగా ఉగాది పర్వదినం రోజున పక్కా ఆధారాలతో ప్రూ చేస్తామంటూ సవాల్‌ విసిరింది. మరీ ఉగాది రోజున టీటీడీ ఏం ఆధారాలు చూపించనుంది.? హనుమంతుడు ఆంధ్రుడే అని ఎలా ప్రూ చేయనుంది. అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి.

రామజన్మభూమి అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న వేళ రామభక్తుడు హనమంతుడి జన్మస్థలం ఎక్కడా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. మా ప్రాంతంలోనే పుట్టాడని కొందరు చెపుతుంటే లేదు లేదు వాయుపుత్రుడు మా ప్రాంతంవాడని మరికొందరు వాధిస్తున్నారు. ఎన్ని వాదనలు వినిపించినా ఎన్నెన్ని ప్రచారాలు చేసినా పవనసుతుడు తిరుమలకొండల్లోనే పుట్టాడని టీటీడీ శాస్త్రీయంగా ప్రూ చేయడానికి సిద్ధమైంది.

తిరుమలలోని అంజనాద్రి కొండలోనే హనుమంతుడు జన్మించాడని టీటీడీ పక్కాగా చెబుతోంది. దీన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి 2020 డిసెంబర్‌లో టీటీడీ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పురాణ, ఇతిహాసాలతో పాటు భౌగోళిక అంశాలను అధ్యయనం చేసి బలమైన ఆధారాలు సేకరించింది. పైగా ఆధారాల ఆధారంతో త్వరలో పుస్తకం కూడా ప్రింట్‌ చేస్తామని ప్రకటించింది టీటీడీ. త్రేతాయుగంలో అంజనాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో పురాణాల్లో కమిటీ సభ్యులు పూర్తి వివరాలు సేకరించారు. భావిసోత్తర పురాణంలోని మొదటి అధ్యయనం 79వ శ్లోకం నుంచి హనుమ జన్మస్థలం, జన్మరహస్యం గురించి ప్రస్తావించారని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

ఆంజనేయుడి జన్మస్థానం తిరుమలే అని టీటీడీ ప్రకటిస్తుండడంతో చిత్తూరు జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన సుతుడు తిరుమలవాడని గర్విస్తున్నారు. జాపాలి తీర్థంలో కొలువైన రామభక్తుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉగాది వేళ టీటీడీ ఎలాంటి ఆధారాలు చూపిస్తుందో అనే ఉత్కంఠ భక్తుల్లో మొదలైంది. ఆ ఆధారాలు విమర్శకులకు సమాధానాలు చెబుతాయా. లేదంటే మరో కొత్త వివాదానికి దారి తీస్తాయా అన్నది వేచి చూడాలి. 

Full View


Tags:    

Similar News