తిరుపతి జూ పార్కుకు పులి కూనల తరలింపు
Andhra News: కూనల సంరక్షణకే తరలిస్తున్నామన్న అధికారులు
Andhra News: నాలుగు రోజులుగా నల్లమల నుంచి బయటకు వచ్చిన నాలుగు పెద్దపులి కూనలు అటవీశాఖ అధికారుల ఆధీనంలో ఉండగా అదృశ్యమై ఆచూకి లేని తల్లి పులి జడ ఎట్టకేలకు తెలిసింది కానీ కూనల దగ్గరికి మాత్రం రాలేదు. దీంతో గందరగోళ పరిస్థితిలో అటవీశాఖ కీలక అధికారులు నాలుగు పులికూనలను రాత్రికి రాత్రే హుటాహుటిన తిరుపతి జూ పార్కు తరలించారు.
నల్లమల్లలో నాలుగు రోజులుగా ఆడ పెద్దపులి ఆచూకీ లేకపోవడం తల్లిని వీడిన నాలుగు కూనలు అటవీశాఖ అధికారుల సంరక్షణలో ఉన్న ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. తల్లిపులి జీవించే ఉందని భావించిన అధికారులు దాని జాడ కోసం ఆపరేషన్ మదర్ టైగర్ చర్యలను అర్ధాంతరంగా నిలిపివేశారు. రాత్రికి రాత్రే నాలుగు పులి కూనలను ప్రత్యేక బోన్ లో అటవీ భద్రత దళాల మధ్య ఉన్నతాధికారులే స్వయంగా తిరుపతి జూకు తరలించారు.
ప్రస్తుతం అడవిలో ఉన్న తల్లి పులి క్షేమంగా సంచరిస్తుందని.... అయితే జాడ తెలియడం ఆలస్యం అవుతుందనే కారణంతో పులి కూనలను తిరుపతికి తరలిస్తున్నామని ఎఫ్ డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. NTCA , AP PCCF ఆదేశాలతో పులి కూనలకు ప్రమాదం వాటిల్లకుండా తక్షణమే తరలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక అటవీ ప్రాంతంలో కూనలను సంరక్షిస్తూ రెండేళ్ల తర్వాత తిరిగి నాగార్జునసాగర్--శ్రీశైలం టైగర్ రిజ్వర్ నల్లమల్లలో వదిలి పెడతామని ఆయన స్పష్టం చేశారు.