AP Mega DSC 2024 Update: మెగా డీఎస్సీ 2024కి ముహుర్తం ఫిక్స్..నోటిఫికేషన్ విడుదల తేదీ ఇదే

Update: 2024-10-30 01:28 GMT

AP Mega DSC 2024 Update: ఏపీ మెగా డీఎస్సీ 2024కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఫైలుపై సీఎం తొలి సంతకం చేశారు. ఇప్పటికే టెట్ పూర్తయ్యి ఫలితాలను రెండు రోజుల్లో చేయనుండగా నవంబర్ 6వ తేదీ డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. మరోవైపు టెట్ ఫలితాలను వెలవరించిన మరుసటి రోజే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం మొదట భావించింది. 3వ తేదీ ఆదివారం రావడంతో నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ల 16, 347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డీఎస్సీలో భర్తీ చేసే పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఈమధ్యే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్ వెలువడిన మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

ఈ ఏడాది వేసవి వరకు కొత్త టీచర్లకు ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తోంది. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఏపీలో దాదాపు 12వేల పాఠశాలలు ఒకే టీచర్ తో నడుస్తున్నాయి. టీచర్ సెలవు పెడితే ఆ రోజ్ బడి మూసివేయాల్సిందే. కొత్త డీఎస్సీల పాఠశాలలకు రెండో టీచర్ ను ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలలకు రెండో టీచర్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదట 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారో లేరోననే సందేహం.

దీంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారు.

Tags:    

Similar News