ఒక్క ఘటన కదిలిచింది.. ఓ పథకం రూపురేఖలనే మార్చేలా చేసింది

ఓ తండ్రి మాటలు కదిలించాయి. నాన్న బాటలో నడిచేలా చేశాయి. పేద పిల్లల భవిష్యత్‌కు దీవెనలుగా నిలిచాయి. నేనున్నానంటూ ఏపీ సీఎం జగన్ విద్యార్థుల తల్లీదండ్రులకు అభయం ఇచ్చారు. జగన్ ను ఇంతలా కదిలించిన ఘటన ఏంటి?

Update: 2020-04-29 09:20 GMT
YS Jagan (File Photo)

ఓ తండ్రి మాటలు కదిలించాయి. నాన్న బాటలో నడిచేలా చేశాయి. పేద పిల్లల భవిష్యత్‌కు దీవెనలుగా నిలిచాయి. నేనున్నానంటూ ఏపీ సీఎం జగన్ విద్యార్థుల తల్లీదండ్రులకు అభయం ఇచ్చారు. జగన్ ను ఇంతలా కదిలించిన ఘటన ఏంటి? ముఖ్యమంత్రి బావోద్వేగానికి కారణాలేంటి? ఇచ్చిన మాట కోసం ఆయనేం చేశారో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే!

ఒక్క ఘటన కదిలిచింది. ఇప్పటికీ ఆ ఘటన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఓ పథకం రూపురేఖలనే మార్చేలా చేసింది. అప్పట్లో విపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న జగన్ ని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ ఘటన కదిలించింది. ఆ తండ్రి కన్నీళ్లు ఆలోచించేలా చేశాయి. ఇలాంటి కష్టం మరెవరకి రాకూడదు అని ఓదార్చుతూనే అభయం ఇచ్చారు.

నేతలు వస్తారు. హామీలు ఇస్తారు..వెళ్లిపోతారు.. ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడరు. ఒక వేళ అక్కడకెళ్లిన చూస్తాం చేస్తాం లేని చెబుతూ వెళ్తుంటారు కానీ జగన్ అలా చేయలేదు. సీఎం కుర్చీ ఎక్కాక ఉదయగిరి ఘటనను మర్చిపోలేదు. ఫీజు రీ ఎయింబర్స్ మెంట్ అంశం వచ్చినప్పుడుల్లా ఆ తండ్రి కన్నీళ్లే గుర్తొచ్చాయి. ఇంతకీ ఏంటా ఘటన. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏం జరిగింది. జగన్ కళ్లముందు కదలాడుతున్న ఆఘటన పూర్వా పరాల్ని ఇప్పుడు చూద్దాం.

నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ తన ఇంటి ముందు కొడుకు ఫొటో పెట్టి, నివాళులు అర్పిస్తున్నాడు. అది చూసిన జగన్ ఏమైందన్నా అని అడిగారు. అప్పుడు ఆ తండ్రి బాధపడుతూ చెప్పిన విషయాలు ఇప్పటికి జగన్ మరిచిపోలేదు.ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వస్తే ఇంజినీరింగ్‌ చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీచాలని ఫీజులు ఇచ్చేవారు, మరోవైపు బోర్డింగ్‌ మెస్‌ ఛార్జీలు కలిపితే లక్ష రూపాయలు దాటే పరిస్థితి. బాలెన్స్‌ ఫీజు ఏం చేస్తావు నాన్నా అని నా కొడుకు అడిగాడు. కొన్ని రోజులుగా అప్పో సప్పోచేసి చదవించా. సెలవులకు ఇంటికి రాగానే మళ్లీ నా కొడుకు అదే ప్రశ్నలు వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. కానీ తన చదువు కోసం కొవ్వొత్తిలా తండ్రి, తన కుటుంబం కరిగి పోవడం ఇష్టం లేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు' అని ఆ తండ్రి చెప్పాడు. ఈ మాటల్ని జగన్ కు కన్నీళ్లు తెప్పించాయి.

గోపాల్ లా మరే తండ్రి కష్టపడొద్దన్న జగన్ ...'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని రూపొందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్‌ గుర్తుచేశారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు.

ఆరోజు అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నామన్నారు జగన్. బోర్డింగ్, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకు వచ్చామన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే ఒక్క చదువులు అన్నది  వేరే చెప్పాల్సిన పని లేదు కుటుంబంలో ఒక్క పిల్లాడైనా మంచి చదువులు చదివితే.. ఆ పిల్లాడికి మంచి జీతం వస్తుందని, మన బతుకుల మారుతాయన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం 2020–21కి సంబంధించి ప్రతి త్రైమాసికం పూర్తైన తర్వాత తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు వేస్తారు. తల్లులు ఫీజులు కట్టడం వల్ల కాలేజీలను వారు అడిగేలా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. టీచింగ్‌ స్టాఫ్‌ బాగా లేకపోయినా, వసతులు బాగా లేకున్నా ప్రశ్నించే అవకాశం కల్పించారు. ప్రతి 3 నెలలకోసారి డబ్బులు కట్టడానికి వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు? వారు సక్రమంగా కాలేజీలకు వెళ్తున్నారా? లేదా? అని తెలుసుకునే అవకాశం ఉండేలా చేశారు.

చదువే ఆస్తి నాదే పూచీ అంటూ జగన్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పిల్లల్ని చదివించండి ఆర్థికంగా ఇబ్బందులున్నా చూసుకుంటానంటూ అభయమిచ్చారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికీ చెబుతున్నా. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు సీఎం స్థానంలో ఉన్నాడు అన్ని రకాలుగా మీ పిల్లలను చదివిస్తాడని సీఎం భరోసా ని ఇచ్చారు. కరోనా కష్టాలున్నా మాట నిలుపుకుని నేనున్నానంటూ అభయమించ్చారు.  


Full View


Tags:    

Similar News