NTR District: భార్య కాపురానికి రావడం లేదని భర్త కుటుంబం ఆగ్రహం.. కత్తులు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడి
NTR District: కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లిన భార్య
NTR District: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో తొర్లపాడులో ఘర్షణ చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని భర్త కుటుంబం ఆగ్రహంతో... భార్య కుటుంబంపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. దీంతో భార్య తరుపు కుటుంబ సభ్యులు సైతం ప్రతిదాడి చేశారు. దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.