AP High court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఫైర్
* ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం * రెండున్నరేళ్ల తర్వాత చెల్లిస్తే కూలీల జీవనాధారం ఎలా అని ప్రశ్న
AP Highcourt: ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ మరోసారి ఫైర్ అయింది. సెప్టెంబర్ 15 లోగా చెల్లించకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.రెండు వారాల క్రితం 494 కేసులలో బిల్లులు చెల్లించాలని ఆదేశాలిస్తే కేవలం 25 కేసులలోనే చెల్లింపులు జరపడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. చెల్లింపుల్లో కోత ఎందుకు విధిస్తున్నారంటూ మండిపడింది.రెండున్నరేళ్ల పాటూ చెల్లింపులు నిలిపేస్తే కూలీల జీవనాధారం ఏంటని కోర్టు నిలదీసింది.
ఈ నెల 15వ తేదీకల్లా ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో, పిటిషనర్, ప్రభుత్వం ఇద్దరూ వివరాలివ్వాలని ఆదేశించింది. డెడ్ లైన్ దాటితే ఇక పిటిషనర్ల వారీగా కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. ప్రతీసారి వాయిదా అడుగుతూ జాప్యం చేయడం పద్ధతిగా లేదని కోర్టు కామెంట్ చేసింది. బిల్లు చెల్లింపులను సర్పంచ్ అక్కౌంట్ లో వేస్తే కాంట్రాక్టర్ కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, వివరాలిస్తే వారిపైనా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్ట్ తెలిపింది.