ఉరవకొండలో స్ట్రీట్ ఫైట్‌కు దిగిన టెన్త్‌క్లాస్ స్టూడెంట్స్.. మూకుమ్మడి దాడి...
Uravakonda: బైక్‌పై వెళ్లే విషయంలో విద్యార్థుల మధ్య వాగ్వాదం...
Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండలో టెన్త్‌క్లాస్ స్టూడెంట్స్ స్ట్రీట్ ఫైట్‌కి దిగారు. 10వ తరగతి చదువుతున్న నవీన్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు స్టూడెంట్స్ వారించి అడ్డుకోవడంతో...గొడవ సద్దుమణిగింది. బైక్‌పై విద్యార్థులు వెళ్లే విషయంపై వీరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధిత విద్యార్థి పోలీసులను ఆశ్రయించగా..దాడి చేసిన వారిని పోలీసులు పీఎస్‌కు పిలిపించి మందలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
మరో ఘటనలో ఇంటర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్ బాలికల కాలేజీలో సరస్వతీ పూజను నిర్వహించారు. అయితే బాయ్స్, గర్ల్స్ కళాశాలలు రెండు వేర్వేరుగా ఉండడంతో బాయ్స్ కాలేజీకి సెలవు ప్రకటించారు ప్రిన్సిపల్ మమత. అయితే తమకెందుకు హాలీడే ప్రకటించారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున కాలేజీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారించినా వినకుండా కాలేజీ గేటుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జరిగిన ఘటనపై ప్రిన్సిపల్ మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు.