Andhra Pradesh: నేడు ఏపీ గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు

Andhra Pradesh: చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణపై ఫిర్యాదు చేసే అవకాశం

Update: 2021-09-18 05:04 GMT

ఏపీ గవర్నర్ ను కలువనున్న టీడీపీ నాయకులు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ, వైసీపీ మధ్య నిన్న జరిగిన వార్‌తో మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ‌్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు ఎదుట చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఏపీలో పొలిటిక్ సెగలు పుట్టిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని టీడీపీ, నిరసన చెప్పేందుకు వచ్చిన తమపై దాడి చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ సృష్టించిన గొడవను అంత తేలిగ్గా వదలబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన తెలుగుదమ్ముళ్లు.. ఇవాల గవర్నర్‌ను కలిసే అవకాశముంది. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి కంప్లైంట్ చేసే అవకాశముంది.

ఇప్పటికే చంద్రబాబు ఇంటి ఎదుట జరిగిన ఘర్షణపై ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేశారంటే తమపై చేశారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 

Full View


Tags:    

Similar News