Andhra Pradesh: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు.. ఏప్రిల్ 17 తర్వాత..
Andhra Pradesh: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఓ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఓ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు చంద్రబాబు, లోకేష్ అన్యాయం చేశారంటూ వెంకట్ అనే పార్టీ నేత అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వెల్లగక్కాడు. తనకు అన్యాయం జరిగిందని లోకేశ్‌కు చెబితే ఆత్మహత్య చేసుకోమన్నాడని అచ్చెన్నాయుడు ముందు వాపోయాడు. అతని వ్యాఖ్యలను సమర్థించిన అచ్చెన్నాయుడు ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, ఏం లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీడియో సంభాషణ వైరల్ కావడంపై స్పందించారు అచ్చెన్నాయుడు. నువ్వు ఎన్ని తప్పుడు వీడియోలు క్రియేట్ చేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్‌రెడ్డి అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు అచ్చెన్న. తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్‌కు తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లు వేయించావు. ఈ రోజు నా సంభాషణలను వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తిరుపతిలో టీడీపీ విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు అంటూ ట్వీట్లు చేశారు అచ్చెన్న.
మరోవైపు టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరికింది. దీంతో సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనుంది టీడీపీ నేతల బృందం. గవర్నర్‌ను కలిసి నిన్న చంద్రబాబు తిరుపతి సభపై రాళ్ల దాడి ఘటనను వివరించనున్నారు బృందం సభ్యులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.