Chandrababu: కుప్పంలో నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Chandrababu: చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు వైసీపీ యత్నం

Update: 2022-08-25 06:55 GMT

Chandrababu: కుప్పంలో నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Chandrababu: కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులను తోసుకుని వైసీపీ శ్రేణులు ముందుకు కదలాయి. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్ ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఉన్న కుప్పంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపార్టీలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల వాగ్వాదంతో ఘర్షణవాతావరణం నెలకొంది. రాళ్లు రువ్వడం, కర్రలతో కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుప్పం వీధుల్లో భీతావహ వాతావరణంతో జనంతోపాటు దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు.

కుప్పంలో జరుగుతున్న మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపుతో ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు కుప్పం డిపోలోనే ఆగిపోయాయి.

కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ నాయకులు, చిత్తూరుపార్లమెంటు ఇన్ ఛార్జి పులివర్తినాని ఇచ్చిన పిలుపుతో టీడీపీ శ్రేణులు కుప్పం చేరుకున్నాయి.

చంద్రబాబు నాయుడు పర్యటనలో అన్న క్యాంటీన్ ఏర్పాటుచేయాలని ఎన్టీఆర్ విగ్రహావరణలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి క్యాంటీన్ ఏర్పాట్లను ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాట్లను చిందరవందర చేశారు. క్యాంటీన్ పరిసరాల్లో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. బందోబస్తు ఉన్న పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు.

Tags:    

Similar News