Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..

Supreme Court: చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆర్కే పిటిషన్‌

Update: 2024-08-21 09:50 GMT

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..

Supreme Court: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్కే పిటిషన్లు వేశారు.

అయితే ఈ రెండు పిటిషన్లను తిరస్కరించింది న్యాయస్థానం. రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదిక చేసుకోవద్దని.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు.

Tags:    

Similar News