Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
Ration Card: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రేషన్ సరుకుల్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు కూడా అందించనుంది.
Ration Card: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రేషన్ సరుకుల్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు కూడా అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల నుంచే వాటిని బియ్యంతోపాటు అందించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అందించనున్నారు.
గత కొన్నిరోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త సీఎం చంద్రబాబు దృష్టికి రాగా.. ఆయన వెంటనే స్పందించారు. కందిపప్పు పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని జులై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారు.