Tirupati: తిరుపతిలో నడిరోడ్డుపై కుప్పకూలిన ఫ్లై ఓవర్

* నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు * పిల్లర్లకు లారీ తగలడంతో ఘటన *కారు, లారీ ధ్వంసం.. తప్పిన ప్రాణనష్టం

Update: 2021-09-19 14:49 GMT

కుప్పకూలిన ఫ్లై ఓవర్ (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరుగనప్పటికీ కారు, లారీ ధ్వంసం అయ్యాయి. తిరుపతిలోని రామానుజ సర్కిల్ లో టీటీడీ బోర్డు స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, ఓ లారీ ట్రక్‌ను పైకెత్తి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో స్వాగత తోరణం దాటుతుండగా లారీ ఆర్చికి తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Tags:    

Similar News