Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ 6 రైళ్లు రద్దు.. మరో 10 దారి మళ్లింపు
Trains: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వరంగల్-విజయవాడ మార్గాల్లో తిరిగే రైళ్లకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు, వరదలు ముంచెత్తడంతో సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Trains Cancelled: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా పలు చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే అప్రమత్తమయ్యింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6రైళ్లను క్యాన్సిల్ చేసింది. మరో 10 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజా బులిటెన్ రిలీజ్ చేశారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు :
-కాజీపేట నుంచి డోర్నకల్ వెళ్లే (07753) రైలు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు
- డోర్నకల్- విజయవాడ మధ్య తిరిగే (07755) రైలు 3, 4, 5వ తేదీల్లో రద్దు
- విజయవాడ - గుంటూరు మధ్య తిరిగే (07464) రైలు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు
-గుంటూరు - విజయవాడ మధ్య తిరిగే (07465) రైలు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ రద్దు
-విజయవాడ- డోర్నకల్ మధ్య తిరిగే (07756) రైలు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు
-డోర్నకల్- కాజీపేట మధ్య తిరిగే (07754) రైలు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దు
దారి మళ్లించిన రైళ్ల వివరాలు :
- ఎస్ఎంవీటీ బెంగళూరు- దానాపూర్
- దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు
- అహ్మదాబాద్- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
- యశ్వంతాపూర్- తుగ్లక్‌బాద్
- పటేల్ నగర్- రోయాపురం
- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా
- కడప- విశాఖపట్నం
- రామేశ్వరం- భునేశ్వర్
- అలప్పా- ధునుబాద్
- తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య తిరిగే రైళ్లను దారి మళ్లింపు