Sonu Sood: కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం మీదే

Sonu Sood: *శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులతో సోనూసూద్ ఇష్టాగోష్టి * సివిల్స్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది

Update: 2021-09-12 10:00 GMT

కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం మీదే

Sonu Sood: పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు ఎంచుకున్న సబ్జెక్టును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం సాధించవచ్చన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సోనూసూద్ శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీ విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. సివిల్స్ అనేది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. సోనూసూద్ ఛారిటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్‌లో శిక్షణ అందిస్తున్నామన్నారు. అందుకు విజయవాడలోని శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 మంది విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్‌లో శిక్షణ అందిస్తున్నామని త్వరలో మరింత ఎక్కువస్థాయిలో అవకాశం ఇస్తామన్నారు. శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీలో నిపుణులైన అధ్యాపక సిబ్బంది ఉన్నారన్నారు. తగిన విధంగా ప్రోత్సాహం తమ ఫౌండేషన్‌ ద్వారా ఉంటుందన్నారు సోనూసూద్. ఈ కార్యక్రమంలో శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్‌చంద్ర తోట, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఛారిటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్‌లో శిక్షణ అందిస్తున్నామన్నారు. అందుకు విజయవాడలోని శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 మంది విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్‌లో శిక్షణ అందిస్తున్నామని త్వరలో మరింత ఎక్కువస్థాయిలో అవకాశం ఇస్తామన్నారు. శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీలో నిపుణులైన అధ్యాపక సిబ్బంది ఉన్నారన్నారు. తగిన విధంగా ప్రోత్సాహం తమ ఫౌండేషన్‌ ద్వారా ఉంటుందన్నారు సోనూసూద్. ఈ కార్యక్రమంలో శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్‌చంద్ర తోట, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News