అమ్మకు గుడి.. రూ.10 కోట్ల ఖర్చుతో..

Temple to Mother: తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టడానికి మొగ్గు చూపుతున్న ఈ కాలంలో కన్నతల్లికి ఆలయం నిర్మిస్తున్నాడో కొడుకు.

Update: 2022-06-07 11:06 GMT

అమ్మకు గుడి.. రూ.10 కోట్ల ఖర్చుతో..

Temple to Mother: తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టడానికి మొగ్గు చూపుతున్న ఈ కాలంలో కన్నతల్లికి ఆలయం నిర్మిస్తున్నాడో కొడుకు. తన కళ్ళ ముందు లేకపోయినా ఓ బాధ్యతగల వ్యక్తిగా పెంచిన ఆ తల్లిని మరువలేక ఆ కొడుకు ఓ పెద్ద ఆలయాన్నే నిర్మిస్తున్నాడు. తల్లి లేదని తెలిసి ఆమె కోసం పురాతన పద్దతిలో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం కడుతున్నాడు.

శ్రీకాకుళం జిల్లాలో చీమలవలస గ్రామం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఆ గ్రామంలో ఉండే యువకుడు సనపల శ్రావణ్ కుమార్ తన తల్లికి ఆలయాన్నే నిర్మిస్తున్నాడు. శ్రవణ్ కుమార్ తల్లి అనసూయదేవి 2008లో మరణించింది. భౌతికంగా దూరమైన తన తల్లిని తలుచుకుంటూ కొడుకు శ్రవణ్ ఓ పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నాడు.

పురాణాల్లో శ్రవణ కుమారుడు అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి పుణ్యక్షేత్రాలకు తిప్పితే ఈ శ్రవణ కుమారుడు తన స్వగ్రామంలోనే ఆలయం నిర్మిస్తున్నాడు. ఈ ఆలయానికి అమ్మ దేవస్థానం అని నామకరణం కూడా చేశాడు. రాతి శిలలతో నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని దేశంలోని ప్రత్యేక నైపుణ్యం కలిగిన శిల్పులతో నమునాలను చెక్కిస్తున్నారు. మరో రెండేళ్లలో ఆలయ పని పూర్తి చేస్తామని యంత్ర ప్రతిష్ట చేసి అనసూయదేవి విగ్రహ ప్రతిష్ట చేస్తామన్నాడు.

అమ్మకు ఆలయం కడుతున్నట్లు శ్రవణ్ కుమార్ చెబితే ఎదో అనుకున్నానని కానీ ఆలయం చూస్తే మతిపోతుందని శ్రవణ్ కుమార్ స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. కొన్ని ఏళ్లపాటు తన తల్లి ఆలయం ఏ విధంగా ఉండాలని, ఎన్నో ప్రదేశాలు తిరిగానని యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణం చూసి వారిని సంప్రదించి గుడి కడతున్నానని శ్రవణ్ కుమార్ అంటున్నాడు.

అమ్మకు ఆలయమంటే సాదాసీదాగా కాదు. ఏకంగా ఈ దేవాలయం కోసం శ్రవణ్‌ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆలయం దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నాడు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇటుకలను వినియోగించడం లేదు.

Tags:    

Similar News