డీజీపీ క్యాడర్‌కు సవాంగ్‌ అనర్హుడు: సోమువీర్రాజు

Update: 2021-01-17 10:08 GMT

ఏపీలో ఆలయాల ధ్వంసం రగడ ఇంకా చల్లరాడం లేదు. అది మెల్లగా పోలీసులు, ప్రతిపక్షాల మధ్య గొడవను రగిలించింది. డీజీపీ ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అధికారపార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ డీజీపీ చేసిన ప్రకటనలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ క్యాడర్‌కు సవాంగ్‌ అనర్హుడని అయన్ని వెంటనే తొలగించాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

పాస్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇచ్చి పోషిస్తుందని సోమువీర్రాజు ఆరోపించారు. చర్చిల ఆస్తులపై విచారణ చేసి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ సర్వీస్ పేరిట నిధులు తీసుకొని మత మార్పిడిలు చేపిస్తున్నారని సోమువీర్రాజు ఆరోపించారు. వేల కోట్ల ఆస్తులున్న చర్చిలకు మళ్లీ ప్రభుత్వం ఎందుకు నిధులు మంజూరు చేస్తుందో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖలో జరుగుతున్న బీజేపీ ‌సమావేశంలో రథయాత్ర, రామతీర్థం ఘటనలపై బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటామని సోము వీర్రాజు వెల్లడించారు. తిరుపతి కొండపై ఇద్దరు మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

Tags:    

Similar News