డిడీఆర్సీ సమావేశంపై కొన్ని మీడియా చానెల్స్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి : ఎంపీ విజయసాయి రెడ్డి

* విశాఖ స్వచ్ఛ్ మారథాన్‌లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి * విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చుతాం * ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడేవారిని ఉపేక్షించేదిలేదు * ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు * మూడు రాజధానులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు * రాబోయే రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది

Update: 2020-11-13 05:44 GMT

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని.. ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆర్కేబీచ్‌లో స్వచ్ఛ్ విశాఖ మారథాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చనున్నామన్నారు. మూడు రాజధానులపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందంటున్న సాయిరెడ్డి. 

HMTV తో విజయ సాయి రెడ్డి  కామెంట్స్..

- డిడీఆర్సీ సమావేశంపై కొన్ని మీడియా చానెల్స్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి.

- శాసనసభ్యులు తమ,తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ఆ సమావేశంలో చర్చించాం.

- ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేసేవారిని ఉపేక్షించేది లేదు.

- ఎంతటి వారిపైనా చట్టపరమైనచర్యలు తీసుకుంటాం.

- మూడు రాజధానులపై కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

- విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చనున్నాం.

- ప్రపంచంలోనే విశాఖపట్నం గొప్పనగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.

- రాబోయే ఐదు సంవత్సరాల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది.

- విశాఖలో 200 చెరువులను కనులకు విందుగా ఉండేవిధంగా వసతి కల్పించనున్నాం

Tags:    

Similar News