School Holiday: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్..సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు సెలవు

School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త చెప్పింది సర్కార్. సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వరుసగా 2 రోజులు సెలువులు రానున్నాయి.

Update: 2024-09-15 03:47 GMT

 School Holidays

School Holiday: విద్యార్థులకు అదిరే వార్త. వరుసగా రెండు రోజులు సెలువలు వస్తున్నాయి. సోమవారం పాఠశాలలకు, కాలేజీలకు సెలవును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇవాళ ఆదివారం, రేపు సోమవారం సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. మళ్లీ ఏపీలో మంగళవారం పాఠశాలలు తెరచుకుంటాయి.

ఇక ఇటు తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ సెలవును ప్రభుత్వం మంగళవారం రోజు ఇచ్చింది. అదే రోజు హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉంది. దీంతో స్థానికంగా ఉండే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఇక వర్షాలతో సెలవులు వచ్చిన కారణంగా సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం రోజు తరగతులు నిర్వహించారు.

ఇవే కాకుండ సెప్టెంబర్ లో ఇంకా సెలవులు ఉన్నాయి. ఈనెల 22వ తేదీన ఆదివారం, 28నాలుగో శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంది. సెప్టెంబర్ 29న ఆదివారం సెలవు. సెప్టెంబర్ 17న ప్రభుత్వం సెలువు ప్రకటించింది. ఆరోజే మిలాద్ ఉన్ననబీ, గణేష్ నిమజ్జంన ఉంది. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు పండగ చేసుకుంటారు.

సెప్టెంబర్‌ నెల హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే

సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు

సెప్టెంబర్‌ 16 మిలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే (ఏపీలో)

సెప్టెంబర్ 17 మిలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే. స్కూల్స్‌కు సెలవు

సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు

సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు

Tags:    

Similar News