Supreme Court: పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దు
EVM Smashing Case: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
EVM Smashing Case: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. ఈ కేసు త్వరగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. కాగా పిన్నెల్లి తనపై దాడి చేశాడంటూ నంబూరి శేషగిరి రావు పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేశారు.