Sajjala Ramakrishna Reddy: చట్టం ఎవరికీ చుట్టం కాదు..
Sajjala Ramakrishna Reddy: పరీక్షల్లో కాపీయింగ్ కల్చర్ మొదలైందే నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల నుంచి అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Sajjala Ramakrishna Reddy: పరీక్షల్లో కాపీయింగ్ కల్చర్ మొదలైందే నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల నుంచి అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అందుకే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పోలీస్ లు అరెస్ట్ చేశారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పీడించి మాజీ మంత్రి నారాయణ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాళ్లను చూసీ చూడనట్లు వదిలేసిందన్నారు. అధికారులకు సీఎం జగన్ స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికారని తెలిపారు.