East Godavari: ఆడపిల్లల్ని కాపాడుకుందాం అంటూ సైకత శిల్పం
East Godavari: శిల్పాన్ని రూపొందించిన విద్యార్ధులు సోహిత, ధన్యత
East Godavari: అత్యాచారాలు, అబార్షన్లు, లింగ వివక్ష, బాల్య వివాహాల నుంచి ఆడ పిల్లలను రక్షించుకుందాం..అంటూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జడ్పీ పాఠశాల విద్యార్థినులు సైకత శిల్పం రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఈ సైకత శిల్పాన్ని రూపుదిద్దారు. ఈ నెల 24న జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా 'ఆడపిల్లగా పుట్టడమే శాపమా.?' అని ప్రశ్నిస్తూ, విద్యార్ధులు రూపుదిద్దిన ఈ సైకత శిల్పం అందరినీ ఆలోచింపజేస్తోంది.