రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
Anakapalle: బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై వెళ్తున్న తల్లి సత్యవతి, కుమారుడు సుకేష్ మృతి
Anakapalle: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. సబ్బవరం మండలం చిన్నయాతపాలెం గ్రామానికి చెందిన సుకేష్ కుమార్.. అతని తల్లి సత్యవతి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో దుండిపాలెం జంక్షన్ వద్దకు వచ్చే సరికి లారీ రాంగ్ రూట్‌లో వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో చిన్న యూత్పాలెంలో విషాదం నెలకొంది.