TTD: బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు

TTD: తిరుమలలో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.

Update: 2021-04-04 05:38 GMT

TTD:(File Image)

TTD: ఎట్టకేలకు రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడి హోదాలో తిరిగి విధుల్లో చేరారు. మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం‌ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. ఆయ‌న పర్మినెంట్ ఉద్యోగి కావడంతో అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోవ‌ని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, 65ఏ ళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ రిటైర్ అయ్యారు. వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి త‌ప్పుకున్నారు.

Tags:    

Similar News