Weather Updates: రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా 3 రోజులు వర్షాలు
Weather Updates: 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం
Weather Updates: బంగాళాఖాతంలో ఇప్పటికే కొనసాగుతున్న వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపటికి ఇది తుపాన్‌గా కేంద్రీకృతం కానుంది. 5వ తేది నెల్లూరు - మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 75 కిలీమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉండనుంది. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అన్ని పోర్టులలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి, మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. కలెక్టర్ కార్యాలయల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయగా..తుపానుకు," మిచౌంగ్ ," గా నామకరణం చేశారు.