PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
PV Sindhu: నైవేద్యం విరామంలో స్వామివారి సేవలో పాల్గొన్న సింధు * దర్శనం అనంతరం తీర్ధప్రసాదాలు అందించిన అర్చకులు
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పీవీ సింధుతో పాటు చాముండేశ్వర్‌నాధ్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.