పులివెందుల సీనియర్ నేత మృతి.. లోకేష్ తీవ్ర దిగ్బ్రాంతి

కడప జిల్లా పులివెందుల టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్..

Update: 2020-09-12 04:26 GMT

కడప జిల్లా పులివెందుల టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో పులివెందులలో తెలుగుదేశం పార్టీ నేతలు షాక్ లో మునిగిపోయారు. వరప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ గారు మరణించడం బాధాకరం. ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను.' అని పేర్కొన్నారు. వరప్రసాద్ మృతిపట్ల పార్టీ నేతలు, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సంతాపం తెలిపారు. కాగా వరప్రసాద్ 2019 పులివెందుల అసెంబ్లీ టిక్కెట్టు కోసం ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో పులివెందుల టిక్కెట్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డికి ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సతీష్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. ఆ తరువాత సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు.  

Tags:    

Similar News