Hanuman Birthplace: హనుమాన్ జన్మస్థలం వివాదంపై రేపు బహిరంగ చర్చ
Hanuman Birthplace: హనుమాన్ జన్మస్థలం వివాదంపై రేపు బహిరంగ చర్చ జరగనుంది.
Hanuman Birthplace: హనుమాన్ జన్మస్థలం వివాదంపై రేపు బహిరంగ చర్చ జరగనుంది. టీటీడీ వేద పండితులు, వేదిక్ స్కాలర్స్ శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ గోవిందానంద సరస్వతిస్వామి ఈ చర్చలో పాల్గోనున్నారు. తిరుమల రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా ఈ డిబేట్ జరగనుంది. హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ తొందరపడిందని శ్రీహనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ గోవిందానందస్వామి అంటున్నారు.
హనుమాన్ జన్మస్థలాన్ని తిరుమల జాపాలిగా ప్రకటించడం తొందరపాటే అన్నారు. అయితే, తమ దగ్గర చారిత్రక, పురాణ, భౌగోళిక ఆధారాలు ఉన్నాయంటోన్న టీటీడీ. దాంతో, హనుమాన్ జన్మస్థలంపై చర్చకు రావాలంటూ టీటీడీకి శ్రీగోవిందానంద సరస్వతి స్వామి సవాలు విసిరారు. శ్రీగోవిందానంద సవాలుతో బహిరంగ చర్చకు సిద్ధమైంది టీటీడీ. దాంతో, రేపు జరగనున్న బహిరంగ చర్చపై ఉత్కంఠ ఏర్పడింది.