PM Modi: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపు ప్రధాని మోడీ పర్యటన

PM Modi: 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోడీ

Update: 2022-07-03 06:11 GMT

PM Modi: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపు ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని మోడీ సోమవారం పర్యటించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. 10గంటల 15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరం బయలుదేరుతారు.

10 గంటల 55 నిమిషాలకు మోడీ భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు భీమవరం నుంచి హెలిక్యాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 1గంట 10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు మోడీ. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News