Guntur: టీడీపీ ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వని పోలీసులు
Guntur: అజ్ఞాతంలో ఉన్న నేతల కోసం గాలిస్తోన్న పోలీసులు
Guntur: టీడీపీ, జనసేన చేపట్టనున్న ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి పర్మిషన్ లేదన్నారు గుంటూరు పోలీసులు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి పిలుపునివ్వగా.. ఈ ర్యాలీకి జనసేన, సీపీఐ మద్దతు తెలిపాయి. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ ప్రకటించారు పోలీసు అధికారులు. ర్యాలీలకు రావొద్దని మూడు పార్టీల నేతలకు నోటీసులిచ్చారు. నోటీసులు ఉల్లంఘించి ర్యాలీకి వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో జైల్లో నిర్బంధంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా శనివారం ‘కాంతితో క్రాంతి’ పేరుతో కార్యక్రమ నిర్వహణకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్లు, టార్చిలైట్లు వెలిగించి ఆయనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి వెలుగు చూపించాలని కోరింది. ‘‘రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు ఆర్పి వెలిగించండి (బ్లింక్). దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయండి. ప్యాలె్‌సలోని జగనాసురుడి కళ్లు బైర్లు కమ్మేలా ఐదు కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా 5 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలపండి’’ అని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలుగువారంతా పాలుపంచుకొని విజయవంతం చేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.