TTD: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..

Update: 2021-05-31 04:38 GMT

తిరుమల ఫైల్ ఫోటో 

TTD: క‌రోనా ఆంక్ష‌ల న‌డుమ గ‌త కొన్ని రోజులుగా శ్రీవారిని ద‌ర్శించుకునే భక్తుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. తిరుమ‌లలో భ‌క్తులు ర‌ద్దీ పెరిగింది. వారంతాల్లో మ‌ళ్లీ అత్య‌ధిక సంఖ్య‌లో భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. శని, ఆదివారాల్లో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మళ్లీ భక్తులతో కళకళలాడాయి. వారాంతమైన శనివారం 13,450 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

మరోవైపు, భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తిరుమలలో గదులు సులభంగానే లభిస్తున్నాయి. 5,281 మంది తలనీలాలు సమర్పించారు. రూ.61 లక్షల హుండీ ఆదాయం లభించింది. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా నిర్మూలనకు,భక్తుల శ్రేయస్సు కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఇవాళ అఖండ సుందరకాండ పారాయణం చేయ‌నుంది. 16 గంటల పాటు ధర్మగిరి వేద పాఠశాలలో సుందరకాండ పారాయణం చేయ‌నున్నారు. 40 మంది వేద పండితులు నిరంతరాయంగా సుందరకాండ జ‌ర‌గ‌నుంది. టీటీడీ చరిత్రలో‌ మొదటి సారి 16 గంటల పాటు సుందరకాండ పారాయణం జ‌ర‌గ‌నుంది. ఇవాళ ఉదయం 6గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ సుందరకాండ పారాయణం జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News