Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురం కలకలం

Prakasam: *ట్యాగ్‌పై AIR 2207 అనే కోడ్ నంబర్ *ఇటీవల ఒడిశాలో ట్యాగ్‌లతో పట్టుబడ్డ పావురాలు

Update: 2022-01-05 07:54 GMT

 ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురం కలకలం

Prakasam: కాలికి ట్యాగ్‌లతో ఉన్న పావురాలు గత కొద్ది రోజుల నుంచి కనిపించడం కలకలం రేపుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కాలికి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్‌ను గమనించారు. దానిపై A.I.R. 2207 అనే కోడ్ నంబర్ ఉంది. అయితే ఇది చైనా పావురం అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మిగతా పావురాలతో పాటు ఈ పావురం కూడా వస్తూపోతుండేదని.. కాని కొత్తగా కాలికి ట్యాగ్ ఉండటంతో దానిని పట్టుకోని పరిశీలించారు. అయితే పావురం కాలికి ట్యాగ్ ఉండటంతో వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించానని నాగరాజు తెలిపారు.

ఇటీవల ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు స్థానికులకు చిక్కాయి. వీటి కాళ్లకు సైతం కోడ్ నంబర్లతో కూడిన రబ్బర్ ట్యాగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. రబ్బర్ ట్యాగ్ పై VHF వైజాగ్ 19742021 ముద్రించి ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పావురాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? ఎవరైనా గూఢచర్యం కోసం వినియోగిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News