Perni Nani: విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రాం...
Perni Nani: కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమీ కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
Perni Nani: కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమీ కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖ కాపు నాడు సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నాని ఖండించారు. సోము వీర్రాజు... GVL మాట్లాడాల్సింది ఢిల్లీలో అని చురకలంటించారు. పంపిన తీర్మానం పార్లమెంట్లో పెట్టీ ఆమోదించమని చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రామని ఫైర్ అయిన పేర్ని నాని... కాపు సీఎం అవ్వాలి అనుకోవడం తప్పు కాదు.. అత్యాశ కాదన్నారు. కేవలం కాపు కులం ప్రేరేపించే వ్యక్తి వల్ల సీఎం అవ్వడం అవుద్దా.. ఆలోచించాలని చురకలంటించారు.