శ్రీకాకుళం జిల్లాను పట్టి పీడిస్తున్న విషజ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు
Srikakulam: తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషజ్వరాలు కలవరపెడుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా తదితర విషజ్వరాలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. . ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో నీరు చేడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి.
శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జనాన్ని జ్వరాలు పట్టిపీడిస్తు్న్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైనేజీల్లో నీరు చేరింది, వాటిని తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ దోమలకు ఆవాసంగా మారాయి. దీంతో జనం మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ బారిన పడుతున్నారు. దోమలకారణంగా చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సత్వర చర్యలు తీసుకొని డ్రైనేజీల్లోని చెత్తా చెదారాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే దోమలు నివారణకు డిడిటి, బ్లీచింగ్, ఎబెట్ మందులు పిచికారి చేయించాలని కోరారు.
ఆసుపత్రిల్లో ప్రజలు బారులు తీరుతున్నారు. గత కొద్దికాలంగా తలనొప్పి, జర్వం, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాగే సొంత వైద్యం చేసుకోవద్దని చెబుతున్నారు.
వెంటనే అధికారులు అప్రమత్తమై కాల్వలలో పూడికలు తీయాలని ప్రజలు కోరుతున్నారు. పరిశుభ్రతలేకపోవడం వల్లే వ్యాధులు ప్రబలతున్నాయంటున్నారు.