Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని అనుసరించాల్సిన సమయం వచ్చింది
Pawan Kalyan: పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వినియోగదార్లకు కాస్త ఉపశమనం కలిగించే విషయమని జనసేనాని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
Pawan Kalyan: పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వినియోగదార్లకు కాస్త ఉపశమనం కలిగించే విషయమని జనసేనాని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని అనుసరించాల్సిన సమయం వచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నామన్నారు. డొమేస్టిక్ సిలెండర్లపై 200 రూపాయల సబ్సిడీ ఇవ్వడం పేదవర్గాలకు ప్రయోజనకరమైన అంశమన్నారు.
చమురు ధరలపై ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు.