Passenger Trains Cancelled: వైరస్ వ్యాప్తి తగ్గాకే పాసింజర్ రైళ్లు.. కోవిద్ సెంటర్లుగా మరిన్ని సేవలు
Passenger Trains Cancelled: కరోనా వైరస్ ఇంటి ఇద్ద ఉంటేనే రోజూ వేల సంఖ్యంలో కేసులు నమోదవుతున్నాయి.
Passenger Trains Cancelled: కరోనా వైరస్ ఇంటి ఇద్ద ఉంటేనే రోజూ వేల సంఖ్యంలో కేసులు నమోదవుతున్నాయి. అలాంటిది కిక్కిరిసి ప్రయాణాలు చేస్తే ఇంకేమైనా ఉందా? ఈ కారణాల వల్లే పాసింజర్ రైళ్లను వైరస్ తీవ్రత తగ్గిన తరువాతే నడపేందుకు వీలుంటుందని డీఆర్ఎం అలోక్ తివారీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్‌ఎం అలోక్‌తివారీ తెలిపారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా విలేకరుల సమావేశాన్నిఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనులను తెలిపారు. ఎర్రగుంట్ల – నంద్యాల మధ్య 123 కి.మీ, ధర్మవరం – పాకాల మధ్య 227 కి.మీ విద్యుద్దీకరణ పనులను 2021లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి – ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో ఆధునిత ఎలాక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నిల్ వ్యవస్థను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.
మిషన్ రఫ్తార్‌లో భాగంగా గుత్తి – రేణుగుంట మధ్యలో 130 కిమీ వేగంతో సుమారు 280 కి.మీలు (రానుపోను) రైలు నడిపినట్లు తెలిపారు. ఈ స్పీడ్ ట్రయల్ రన్‌ను సీఓసీఆర్ (కన్ఫర్మేటరీ ఓసీలోగ్రాప్ కార్‌రన్) ద్వారా ఈ రైలు మార్గంలో ట్రాక్ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి – వాడీ మధ్య ట్రాక్ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్ నాటికి ఈ మార్గంలో కూడా 130 కి.మీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పత్రిని కోవిడ్ కేర్ సెంటర్‌గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.