Pandem Kollu: సంక్రాంతి పందేలకు సై అంటున్న పందెం కోళ్లు

Pandem Kollu: పందేలను తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి రాక

Update: 2022-12-26 02:32 GMT

Pandem Kollu: సంక్రాంతి పందేలకు సై అంటున్న పందెం కోళ్లు

Pandem Kollu: డిపందేలు..ఏటా ఎంతో సందడిగా జరిగే కోడి పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు వస్తుంటారు. పండుగ సమయం ఆసన్నమవుతుండటంతో..పందెం రాయుళ్లు కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు.

కోడి పందేల్లో కోట్లు రూపాయిలు చేతులు మారుతుంటాయి. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో శిక్షణ ఇచ్చి, డ్రైఫ్రూట్స్ పెట్టి మరి పెంచుతున్నారు. ఇలా పెంచుతున్న కోళ్లు ఖరీదు వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం.

సంక్రాంతి బరిలో దించే కోడి పుంజులపై పందెం రాయుళ్లు, పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. సుమారు ఏడాది పాటు పుంజులను పెంచుతారు. బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఒక్కో పుంజుపై, సుమారు 10వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు తమ ఇంటి వద్దే పందెం కోళ్లను పెంచుతూ పండుగ సమయంలో వాటిని విక్రయిస్తారు.

పందెం పుంజులకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్ కైమా, జీడిపప్పు, బాదంపప్పు, కోడిగుడ్లను పుంజులకు ఆహారంగా పెడతారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా, ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి, ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు. జిల్లాలో పందెం పుంజులను భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట, తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పెంచుతుంటారు.

పందెం పుంజుల జాతి, రంగు, పోరాడే విధానాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. ప్రస్తుతం పుంజుల కోసం అడ్వాన్సులు ఇచ్చి వెళ్లగా..మరికొందరు నేరుగా తమకు కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. దీంతో పాటు పండుగకు పందేలు జరిగే ప్రాంతాలకు వెళ్లి అక్కడా నేరుగా కూడా విక్రయిస్తుంటారు. 

Tags:    

Similar News