IRCTC Tour: ఐఆర్‌సీటీసీ తిరుపతి దేవస్థానం ప్యాకేజీ.. ఢిల్లీ నుంచి ప్రారంభం.. ఒక్కరికి ఎంతంటే..?

IRCTC Tour: తిరుపతి వేంకటేశ్వర స్వామి దేశంలోని అత్యంత ధనిక, ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

Update: 2022-04-30 09:11 GMT

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ తిరుపతి దేవస్థానం ప్యాకేజీ.. ఢిల్లీ నుంచి ప్రారంభం.. ఒక్కరికి ఎంతంటే..?

IRCTC Tour: తిరుపతి వేంకటేశ్వర స్వామి దేశంలోని అత్యంత ధనిక, ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు కొన్ని నెలల ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవాలి. ఈ పరిస్థితిలో మీరు వేసవి సెలవుల్లో తిరుపతిని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే ఐఆర్‌సీటీసీ మీకు గొప్ప టూర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ పేరు తిరుపతి దేవస్థానం ఎక్స్ ఢిల్లీ.

తిరుపతి దేవస్థానం X ఢిల్లీ టూర్ ప్యాకేజీ టైమ్ టేబుల్

తిరుపతి దేవస్థానం ప్రయాణం మొత్తం 1 రాత్రి, 2 రోజులు ఉంటుంది. ఈ ప్రయాణం ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. తరువాత ప్రయాణికులు ఢిల్లీ నుంచి చెన్నైకి విమానంలో వెళ్తారు. ఈ యాత్ర మే 15న ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. చెన్నైలోని శ్రీ కాళహస్తి ఆలయాన్ని, తిరుచానూరు (శ్రీ పద్మావతి దేవి) ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్న, రాత్రి భోజన సదుపాయం అక్కడే ఉంటుంది. తరువాత రెండో రోజు ప్రయాణికులకు అల్పాహారం ఇస్తారు. దీని తర్వాత హోటల్ నుంచి బయలుదేరి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతారు. అనంతరం చెన్నై విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి ఢిల్లీకి వస్తారు.

ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి

మొత్తం ప్యాకేజీలో విమానంలో ప్రయాణించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. మీరు హోటల్‌లో రాత్రిపూట బస చేసే సౌకర్యం లభిస్తుంది. దీంతో పాటు ప్రయాణంలో మీకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యం లభిస్తుంది. మీరు ప్రయాణించడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. అదే సమయంలో బాలాజీని సందర్శించడానికి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం ప్రయాణంలో మీరు టూర్ గైడ్ సౌకర్యం పొందుతారు. ప్రయాణీకులు ప్రయాణ బీమా ప్రయోజనం పొందుతారు.

ప్యాకేజీకి రుసుము

ఈ ట్రిప్‌లో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.20,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులైతే ఒక్కొక్కరికి 18,890 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు వ్యక్తులయితే ఒక్కొక్కరికి రూ.8,780 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు ప్రత్యేక రుసుము చెల్లించాలి.

Tags:    

Similar News