Tirupati: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సంక్షోభం

Tirupati: స్పత్రికి సరఫరా చేసే ఆక్సిజన్‌లో కోత విధించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ

Update: 2021-05-15 07:29 GMT

తీరుపై స్విమ్స్ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిని ఆక్సిజన్‌ సంక్షోభం వేధిస్తోంది. ఆస్పత్రికి సరఫరా చేసే ఆక్సిజన్‌లో కోత విధించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్‌ వాటర్‌ కంపెనీ నుంచి స్మిమ్స్ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. రెండు విడతలుగా రోజుకు 14కేఎల్‌ లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 8 కేఎల్‌కు మించి పంపించలేమని గుత్తేదారులు స్విమ్స్‌కు తేల్చిచెప్పారు. స్విమ్స్‌లో ప్రస్తుతం 467 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అందులో 90శాతం పడకలకు ఆక్సిజన్‌ అవసరముంది. పరిస్థితిని కలెక్టర్‌, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ దృష్టికి స్విమ్స్‌ డైరెక్టర్‌ తీసుకెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని స్విమ్స్‌ డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News