CM Jagan: తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: పోతవరం హైస్కూల్‌లో నాడు-నేడు పైలాన్ ఆవిష్కరించిన జగన్ * మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం -సీఎం జగన్c
CM Jagan: తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం హైస్కూల్‌లో నాడు-నేడు పైలాన్ ఆవిష్కరించారు. నాడు-నేడు తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేశారు జగన్. నాడు-నేడు పనుల్లో ఆధునీకరించిన క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించిన సీఎం.. పాఠ్య పుస్తకాలు పరిశీలించి విద్యార్థులు, టీచర్లతో ముచ్చటించారు. అనంతరం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసి, నాడు-నేడు రెండోదశ పనులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్.
ఇక.. మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని అన్నారు సీఎం జగన్. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయన్న ఆయన కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాస్‌ల నిర్వహణ జరుగుతుందన్నారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే రోజు తప్పించి రోజు తరగతులు జరుగుతాయని స్పష్టం చేశారు సీఎం జగన్. అందరి టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్.. విద్యార్థులకు పుస్తకాలు సహా అన్ని వస్తువులు ఇస్తున్నామన్నారు.