Andhra Pradesh: మూడు రాజధానుల బిల్లుపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ
Andhra Pradesh: నిపుణుల కమిటీ వంటి ప్రక్రియ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్
Andhra Pradesh: మూడు రాజధానుల బిల్లుపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిపుణుల కమిటీ వంటి ప్రక్రియ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ అత్యవసర భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్లానింగ్‌శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పలు దశల్లో ఎదురైన చిక్కులపై విజయ్ కుమార్ సమగ్రంగా వివరించారు.
దీంతో ప్రస్తుత బిల్లుతో చిక్కులు తప్పవని అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం. పూర్తిస్థాయి కసరత్తు తర్వాత మరో రూపంలో బిల్లు తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లు ఎందుకు వెనక్కు తీసుకుంటున్నారో సభలో సీఎం జగన్ వివరించనున్నారు. రెండేళ్లుగా జరిగిన అన్ని అంశాలను సభలో సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.